పెద్దపప్పూర్ మండలంలోని కుమ్మెతలో చెన్నకేశ వస్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారిని శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, కల్యాణ మంటపానికి తీసుకొ చ్చారు. వేద పండితులు శాస్త్రోక్తంగా స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించడానికి పుట్టూరు, యల్లనూరు, యాడికి, పెద్దవడుగూరు మండలాల భక్తులు తరలివ చ్చారు. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రసా దం. అన్నదానం పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa