తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం లో 7: 30 గంటలకు ఆలయంలో వెంకన్న కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. మరెక్కడా లేని విధంగా శ్రీదేవి, భూదేవి లతో పాటు పద్మావతి అమ్మవారితో వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆలయ అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.
భక్తులకు తీర్థ అన్నప్రసాద లతోపాటు వస్త్ర బహుమానం అందజేశారు. రాత్రి 11 గంటలకు స్వామివారు క్షత్రియ వేషధారణ డై చేత ఖడ్గంతో కల్కిగా అశ్వవాహనం అధిరోహించి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తుల నుండి హారతులు అందుకున్నారు.