జ్ఞానవాపి మసీదు మసీదు అంశం తాజాగా దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై పలువురు పలువిధాలుగా మాట్లాతున్నారు. అంతేకాదు వారణాసిలోని జ్ఞానవాపి మసీదు విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మసీదు ప్రాంగణంలో శివలింగం ఉందని మీడియాలో ప్రచారం సాగుతోంది. తాజాగా ఇదే అంశంపై సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసినందుకు ఢిల్లీకి చెందిన ఓ ప్రొఫెసర్‌ను అరెస్టు చేయడం గమనార్హం. ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లాల్‌ను పోలీసులు గత రాత్రి అరెస్టు చేశారు. ఆయన పోస్ట్ రెచ్చగొట్టేలా ఉందని ఆరోపిస్తూ కేసు నమోదుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa