చార్ ధామ్ యాత్రలో ఆ యాత్రికుల పాలిటి శాపంగా మారింది. ఇదిలావుంటే చార్ ధామ్ యాత్రలో భాగమైన యమునోత్రి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. రక్షణ గోడ కూలిపోవడంతో ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 10వేల మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. గోడ కూలిపోవడం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆ మార్గంలో నిలిచిపోయాయి. ఇప్పటికిప్పుడు రహదారి అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం మూడు రోజులు అయినా పట్టొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa