హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాను కేసులు వెంటాడుతునే ఉన్నాయి. తాజాగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన ఆరోపణలపై హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాపై గతంలో నమోదయిన కేసుపై విచారణను చేపట్టిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు శనివారం చౌతాలాను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయనకు ఏ తరహా శిక్ష విధించాలన్న విషయంపై కోర్టు ఈ నెల 26న చేపట్టనున్న విచారణలో నిర్ణయం తీసుకోనుంది.
ఇదిలావుంటే హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా మరో కేసులో దోషిగా తేలారు. ఇప్పటికే టీచర్ల కుంభకోణంలో ఆయన దోషిగా నిరూపితమై, పదేళ్ల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. జైలు శిక్ష పూర్తి చేసుకుని గతేడాది జులైలో ఆయన విడుదలయ్యారు. పదేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చి ఏడాది కాకముందే మరో కేసులో దోషిగా తేలిన ఆయనకు ఈ సారి ఏ తరహా శిక్ష పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.