ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీలక ఘట్టం పూర్తి: స్వయంగా వెల్లడించిన మేఘా సంస్థ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 09:18 PM

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఓ కీలక విషయాన్ని ఆ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా కంపెనీ వెల్లడించింది. ఏపీ జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టులో కీల‌క స్పిల్ వే నిర్మాణం పూర్తయింది. ఈ మేర‌కు శ‌నివారం ఆ ప్రాజెక్టు ప‌నుల‌ను చేప‌డుతున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. స్పిల్‌వేలో 48 రేడియ‌ల్ గేట్ల నిర్మాణం పూర్తి అయ్యింద‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. 


అదే స‌మ‌యంలో 98 హైడ్రాలిక్ సిలిండ‌ర్ల‌ను కూడా ఏర్పాటు చేసినట్లు మేఘా తెలిపింది. రేడియ‌ల్ గేట్ల‌ను ఎత్తేందుకు 24 ప‌వ‌ర్ ప్యాక్‌ల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు ఆ సంస్థ వివ‌రించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa