అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు శివారు కాలనీలు, ఒంటరిగా ఉంటున్న ఇళ్లు, లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఏటిఎం సెంటర్లు, బ్యాంకుల వద్ద పటిష్ట బందోబస్తు చేపట్టారు. నైట్ బీట్లు, పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. అపరిచితులు, అనుమానితులను లోతుగా చెక్ చేశారు. రాత్రి వేళ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ వారు మాట్లాడుతూ... జిల్లాలో ఎక్కడ అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీస్ సహకరిస్తుంది అని, అదేవిధంగా ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమాలకి సహకరించాలని పిలుపునిచ్చారు.