దిశా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని పల్నాడు జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చిన జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్. దిశా యాప్ యొక్క ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసీ,వారు తమ ఫోన్లలో దిశా యాప్ డౌన్లోడ్ చేసుకోని,ఉపయోగించుకునే విధంగా పల్నాడు జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది, మహిళ పోలీస్ , సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు, ఇతర శాఖల అధికారులు మరియు సిబ్బంది కృషి చేసారు. శనివారం నిర్వహించిన దిశా యాప్ డౌన్లోడ్ ప్రత్యేక డ్రైవ్ లో 85 వేల(85,000) పై చిలుకు దిశా యాప్ లను ప్రజలు డౌన్లోడ్ చేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు.