"అమ్మా... నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి స్వయంగా వచ్చి ప్రజల ఆలోచనలు, సమస్యలు తెలుసుకోవాలని తిరుగుతున్నాం.. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి.. మన ఇంటి బిడ్డగా మనల్ని కాపాడుకుంటాడు అంటూ ఐదో రోజు పవనన్న ప్రజాబాటలో కెత్తంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేస్తున్నారు. "నా పేరు కేతంరెడ్డి వినోద్ రెడ్డి... ఈసారి వచ్చినపుడు ఎవరో వచ్చారని అమ్మకి చెప్పకూడదు.. నా పేరు నువ్వు గుర్తుపెట్టుకోవాలి.. అదేవిధంగా నీ పేరు నేను గుర్తు పెట్టుకుంటా.. అదీ మనిద్దరి మధ్య డీల్..." ఓ కుటుంబంతో సరదా సంభాషణ. ఇలా పవనన్న ప్రజాబాటలో ఓ ఇంటిని ఆత్మీయంగా పలుకరించి తిరిగి వెళ్తున్న సమయంలో ఇంట్లో పిల్లోడు "అన్నా.. వీధి లైటు పోయి చాలా రోజులైంది" అనగా వెంటనే వీధి లైటుని మార్చాలని అధికారులను కోరిన కెత్తంరెడ్డి , ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... ప్రజా సమస్యలు తీర్చడానికే ఈ యాత్ర అని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు అని తెలియజేసారు జనసేన నాయకులూ.