ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ అనంత బాబు పదవి నుంచి తప్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 01:30 PM

ఎమ్మెల్సీ అనంత బాబును పదవి నుంచి తప్పించాలని తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రాజశేఖర్ డిమాండ్ చేశారు. కాకినాడలో జరిగిన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యను నిరసిస్తూ సత్యవేడు లో ఆదివారం రాత్రి స్థానిక గాంధీ విగ్రహం వద్ద టిడిపి నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ అనంత బాబు ని సస్పెండ్ చేయాలని కోరుతూ. ఆయన కాగడాల ప్రదర్శన నిర్వహించారు.


దళితులపై దాడులకు తెగబడుతున్న వైసీపీ ప్రభుత్వం నశించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేడీ రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన లో దళితులకు రక్షణ కరువైందని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులపై దాడులు నిత్యకృత్యం అయిపోయింది అని ఆరోపించారు.


దళితుల ఓట్లతో సీఎం కుర్చీలో కూర్చున్న జగన్ రెడ్డి దళితులపై దాడులు చేయిస్తున్నారని, దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించకుండా వెనకేసుకొస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు పై సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com