కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి నుంచి అనంతబాబు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చూపే అవకాశం ఉంది. నిన్న ఆదివారం కావడంతో ఎమ్మెల్సీని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారించారు. అయితే ఎమ్మెల్సీ అరెస్ట్ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కోర్టుకు తీసుకొస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయని నేరుగా మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కస్టడీ పిటిషన్ వేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.