దేశ రాజధాని దిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. బలమైన ఈదురుగాలులు., ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి దిల్లీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తెల్లవారు జామున..... గంటకు 50 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలి రోడ్లపై పడ్డాయి. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో... గోడలు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయి.అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడంతో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొద్దిసేపు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. .