8 మంది వలస కూలీలు దుర్మరణం చెందిన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పడంతోనే ఈ ఘటన సంభవించింది. లారీ బోల్తా పడటం వల్లే 8 మంది ప్రాణాలు పోగోట్టుకున్నారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్ణియా జిల్లాలోని జాలాల్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఈ ఘోరం కలకలం రేపింది.
సిలిగురి నుంచి జమ్మూకు లారీ వెళ్తుండగా అందులో వలస కూలీలు ఉన్నారు. చనిపోయినవారందరూ రాజస్తాన్ కు చెందిన వారిగా పోలీసులు నిర్దారించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తే 8 మంది ప్రాణాలకు కారణమైందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.