సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉదయ్ భాస్కరే డ్రైవర్ ను హత్య చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ మాట్లాడుతూ, సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎమ్మెల్సీ కలిశారని... హత్య కేసు నుంచి రక్షించాలని వారిని కోరారని తెలిపారు. మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ. 1 కోటి పరిహారాన్ని చెల్లాంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని హోంమంత్రి వనిత ఇంత వరకు పరామర్శించలేదని దుయ్యబట్టారు.