భారత్ కు మంకీపాక్స్ ముప్పు ఏర్పడింది. కేసులు పెరుగుతుండడంతో ముంబైలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. 2 వారాల్లో 14 దేశాలకు వ్యాధి విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చే వారి పై కూడా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ కు వస్తున్న వారిలో ఈ వ్యాధి ఉండవచ్చనే అనుమానంతో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
మంకీ పాక్స్ లక్షణాలివే:
పాక్స్ వైరస్ ను చర్మంపై ర్యాషెస్ రూపంలో గుర్తించొచ్చు.
బొబ్బల మాదిరిగా (కణుపులు మాదిరి) చర్మం అంతటా పాకొచ్చు.
ఫ్లూ మాదిరి లక్షణాలు కూడా ఉంటాయి.
జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, కండరాల నొప్పులు కనిపిస్తాయి.