21 ఏళ్లు అమ్మాయిగా బతికిన ఓ యువతికి డాక్టర్లు సడెన్ గా షాకిచ్చారు. ఆమె 'ఆమె' కాదు 'అతడు' అని చెప్పారు. ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది. ఆ యువతి పేరు రాండా షబెలి. ఆమె రియాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించింది. ఆ సమయంలో ఆమె జననేంద్రియ ప్రాంతంలో కొన్ని వైకల్యాలు ఉన్నాయి. ఆ శిశువును వైద్యులు ఆడ శిశువుగా భావించారు. అయితే ఆమె ఎదుగుతున్న కొద్ది స్త్రీల యుక్త వయస్సుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దీంతో రాండాకు అనుమానం వచ్చి ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఒక షాకింగ్ విషయం చెప్పారు.
ఆమె పొత్తికడుపులో పురుష జననాంగాలు ఉన్నాయని చెప్పారు. 21 ఏళ్లు అమ్మాయిగా బతికిన తర్వాత ఇప్పుడు ఆమె అమ్మాయి కాదని చెప్పడంతో రాండాకు మతిపోయినంత పనైంది. ఈ విషయం విని ఆమె బంధువులు, స్నేహితులు, తెలిసిన వారంతా షాక్ అవుతున్నారట. ఈ విషయం కాస్తా అక్కడి మీడియాకు తెలియడంతో వార్త బయటకు వచ్చింది.