శ్రీశైల మల్లన్న భక్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దోర్నాల ఘాట్ రోడ్డు నుంచి శ్రీశైలం వెళ్లేందుకు రాత్రి వేళల్లో టోల్ గేట్ సమయాన్ని మార్చేందుకు అటవీశాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
రాత్రి 9.30 గంటల వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇక నుంచి రాత్రి 10.30 గంటల వరకు సమయాన్ని పెంచాలన్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు గేటు తొలగించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని వెల్లడించారు. శ్రీశైలంలోని భూములను అటవీశాఖ, రెవెన్యూశాఖ అధికారులతో సర్వే చేయిస్తామన్నారు.