ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఓటీఎస్ తో గృహాలపై శాశ్వత హక్కు పొందవచ్చని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం వైయస్ఆర్సిపి ఇన్చార్జ్ కిషోర్ రెడ్డి అన్నారు. మండలంలోని మేర్లపాక సచివాలయంలో మేర్లపాక, చిందేపల్లె పంచాయతీలకు చెందిన 80 మంది లబ్ధిదారులకు ఓ టి ఎస్ పత్రాలు కిషోర్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ టి ఎస్ ద్వారా మహిళలకు ప్రభుత్వం వారి గృహాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందన్నారు. తద్వారా బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ గృహాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.