రేపల్లె పట్టణం లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు పరిశీలించారు. రేపల్లెలో అరవపల్లి రోడ్డు విస్తరణలో భాగంగా 60 అడుగుల రోడ్డు ఏర్పాటు పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి చొరవతో వేమూరు, రేపల్లె నియోజకవర్గాలను కలిపి రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు.
ఈ నేపథ్యంలో రేపల్లె పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో రేపల్లె పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, పోలీసులు, పట్టణ వైసిపి కన్వీనర్ గడ్డం రాధాకృష్ణ, మున్సిపల్ చైర్మన్ కట్టా మంగ, వైస్ చైర్మన్ లు గుజ్జర్లమూడి ప్రశాంత్, తూనుగుంట్ల కాశీవిశ్వనాథ గుప్తా, కార్యకర్తలు పాల్గొన్నారు.