ప్రచారానికే పరిమితమైన జగనన్న స్వచ్ఛ సంకల్పం. గ్రామీణ ప్రాంతాలను చూడ చక్కని గ్రామంగా, సుందరంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఇలా గ్రామంలో పారిశుధ్య పనులు, వీధిలైట్లు, శానిటేషన్ తదితర పనులను ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లో, గ్రామపంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో 100 రోజుల పాటు పనులు చేపట్టాల్సి ఉంది.
కానీ అందుకు విరుద్ధంగా వారు నిర్దేశించిన ప్రదేశం దగ్గరకు వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చి సరిపెడుతున్నారు. మండల కేంద్రం అమృతలూరు లోని గ్రామ సచివాలయం, గ్రామపంచాయతీ కార్యాలయాల మధ్య నున్న చెరువు లో గడ్డిజాతి మొక్కలు పెరిగి పాములు, దోమలకు స్థావరం ఏర్పాటు అయ్యింది. గ్రామపంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చెపట్టక పోవడం వల్ల చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్భరమైన పరిస్థితి నెలకొంది.
అక్కడ సంచరించే పాములతో చెరువు చుట్టుపక్కల వారికి ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. కార్యాలయంకు ఉన్నతాధికారులు, గ్రామస్తుల రావాలన్న ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఆమార్గం గుండా గ్రామపంచాయతీ, సచివాలయం సిబ్బంది ప్రతిరోజు వెళ్తున్నారు. కానీ అక్కడ దృష్టి పెట్టక పోవడంపై గ్రామస్తులు విమర్శిస్తున్నారు.