పీలేరులో వేరుశెనగ విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. స్ధానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖరీఫ్ రైతులు ముందుగా రైతు భరోసా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకుని, తమకు కావలసిన వేరుశెనగ విత్తన కాయలను పొందాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి కంభం సతీష్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి ఏటి రత్న శేఖర్ రెడ్డి, సర్పంచ్ డాక్టర్ షేక్ హాబీబ్ బాష, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడప గిరిధర్ రెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎండి షఫి, మండల వైసీపీ కన్వీనర్ దండు జగన్ మోహన్ రెడ్డి, వైస్ ఎంపిపి ఎన్. వి. చలపతి, నాయకులు కంభం నరసింహా రెడ్డి, నాగభూషణం, ఏడిఎ మజీద్ అహమద్, ఏఓ కళ్యాణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.