తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకొని నిర్వహించనున్న మహానాడును ప్రభుత్వం అడ్డుకోవడం విడనాడాలని రాజంపేట పార్లమెంట్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పి.సురేంద్ర యాదవ్ దుయ్యపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం అంగళ్లులోని తన టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... ప్రతి యేటా దిగంత రామారావు జయంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న సభను అడ్డు తగులుతూ విధ్వంసం సృష్టించడం సమంజసం కాదన్నారు.
మహానాడుకు వెళ్ల నీయకుండా అడ్డు తగులుతూ సచివాలయ సిబ్బంది, పోలీసులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు బెదిరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వైకాపా ప్రభుత్వం స్వేక్షను బంగ పరుస్తూ హింసిస్తున్నారని ఇది ఇప్పటికైనా ఇటువంటి పనులు విడనాడాలని ఆయన ఈసందర్బంగా ఉద్భోధించారు. ఇది ప్రాథమిక హక్కుగా భావించాలని, ప్రభుత్వ యంత్రాంగం గుర్తుంచుకోవాలనిఅయన కోరారు. మహానాడు పై పెట్టిన దృష్టి, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అధికధరలు అభివృద్ధి పై, శ్రద్ధ చూపి ప్రజలకు రక్షణగా, తోడుగా నిలబడాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరికి సమానంగా వ్యవహరించాలని ప్రజాసేవకు అడ్డుకొనే ప్రయత్నాలు మానుకోక పోతే ప్రజా గ్రహానికి గురికాక తప్పదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.