తిరుపతి మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు రైళ్లకు అదనపు బోగీలు తగిలించాలని అధికారులు నిర్ణయించారు. తిరుపతి - విశాఖపట్నం తిరుమల ఎక్స్ ప్రెస్ ( 17487, 17488 ) కు జూన్ ఒకటి నుంచి 11 తేదీ వరకు స్లీపర్ కోచ్ ఏర్పాటు చేస్తారు. భువనేశ్వర్ - తిరుపతి ఎక్స్ ప్రెస్ ( 22871 , 22872 ) కు జూన్ 5 నుంచి 26 వ తేదీ వరకు 3 ఏసీ కోచ్లు అదనంగా ఉంటాయి.