నిమ్మనపల్లి మండల కేంద్రంలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానము నందు హనుమజ్జయంతి ని పురస్కరించుకొని బుధవారం నుండి మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త మంగళంపేట శంకరయ్య, కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25వ తేదీన హనుమజ్జయంతి, 26 వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, 27వ తేదీన పగలు ఉట్ల తిరుణాల ను వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాలను పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కాగలరని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa