గ్రామాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపిపి నరసింహులు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో తాజ్ మస్రూర్ తో కలిసి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి తాగునీటి సమస్యలపై వెంటనే స్పందించాలి అన్నారు. స్థానిక సర్పంచ్ లతో సమన్వయ పరుచుకుని సమస్యలు పరిష్కరించాలని అన్నారు.
అదేవిధంగా జగనన్న పక్కా గృహా నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు, బిల్లులు సత్వరమే ఆన్ లైన్ చేయాలన్నారు. ఇంటి నిర్మాణాలు వేగంగా జరిగేలా సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో నిత్యం పర్యవేక్షించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి వెంకట సుబ్బయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హరినాథ్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శులు లోకేశ్వరి, గాయత్రి, గిరిధర్ నాయక్, సరస్వతి, నాగమల్లి, మంజునాథ్, ఎర్ర మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.