జెఎన్‌టియు ఇంక్యుబేషిన్, ఇన్నో వేషన్ సెంటర్ ఆద్వర్యంలో నిర్వహించిన ఒక్క రోజు సదస్సును ఉపకులపతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ ఇటువంటి సదస్సుల వల్ల విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి ఇది గొప్ప ప్లాట్‌పామ్ అని తెలిపారు. విద్యార్థులు వారి ఆలోచనలను ప్రొడక్ట్‌గా మార్చే విధంగా వారి నాలెడ్జ్‌ను పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యార్థులు వారి హార్డ్‌వర్క్‌తో వారి జీవితంలోని లక్ష్యాన్ని ఛేదించాలని తెలిపారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న గణేషన్ నారాయణ స్వామి మాట్లాడుతూ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, చిప్ డిజైన్లలో స్కిల్స్‌ను పెంపొందించు కోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పేటెంట్ పిల్ చెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్‌గా పాల్గొన్న అభిషేక్ మహేంద్ర కుమార్, ఎంగేజ్ మెంట్ అసో షియేట్, సిఎస్‌ఆర్ బాక్స్ వారు మాట్లాదుతూ విద్యార్థులు నాలెడ్జ్‌తో పాటు టెక్నాలజీ, మ్యానుపాక్చరింగ్ రంగాలలో స్కిల్స్‌ను డెవలప్ చేసుకోవాలని తెలిపారు. వర్శిటీ రెక్టార్ ఆచార్య విజయకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలతో ఉద్యోగాలు ఇచ్చే విధంగా గారు మాట్లాడుతూ స్టార్ట్ అప్ కంపెనీలను విద్యార్థులు ప్రరంబించేలా తయ్యారవ్వాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఆచార్య పి. సుజాత అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్‌గా ఆచార్య ఆర్. భువనవిజయ డాక్టర్ జి. మమత, డాక్టర్ బి. ఓంప్రకాష్ వ్యవహరించారు.