పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల నుండి స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని, నిన్న జరిగిన కార్యక్రమానికి ప్రజల నుండి 87 ఫిర్యాదులు అందాయని తెలియజేసారు. స్పందన కార్యక్రమంలో ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను ఉన్నతాధికారులకు తెలియపరచవచ్చుఅని భరోసా ఇచ్చారు. అలానే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, సదరు ఫిర్యాదుల తక్షణ పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.