మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో హత్యాచారానికి గురైన తిరుపతమ్మ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్ధిక సాయాన్ని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ అందించారు. తిరుపతమ్మ కుమార్తె అఖిల పేరున రూ.3 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్, కుమారుడు వరుణ్ సాయి పేరు మీద రూ.2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి..సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు, అలానే ఎప్పుడూ ఏ సమస్య ఉన్నా అన్నగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండలం టిడిపి నాయకులు, మంగళగిరి టీడీపీ నాయకులూ తదితరులు పాల్గొన్నారు.