కుందుర్పి మండల కేంద్రంలో వెలసిన ఆది పరాశక్తి కుందుర్పమ్మ దేవాలయంలో విశేష పూజలు అభిషేకాలతో ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుందుర్పమ్మ జాతర మంగళవారం ఉదయం 5గంటలకే కుందుర్పి గ్రామ పుర ప్రముఖుల ప్రజల భక్తాదుల నడుమన ఘనంగా ప్రారంభం అయినది. కుందుర్పి మండలం చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు కుందుర్పమ్మ దేవతను కొలిచిన వెంటనే కొంగుబంగారమై తమ కష్టాలన్నీ వైదొలగి సర్వ రోగములు నయమై తమ జీవితం ప్రశాంతంగా ఉంటుందని గ్రామ దేవత పై ప్రగాఢ నమ్మకం.
మంగళవారం ప్రారంభమైన జాతర గురువారం రోజున పాతప్ప పూజా కార్యక్రమంతో ముగుస్తుందని ధర్మకర్త సత్యనారాయణ శాస్త్రి తెలిపారు. కావున ఆశేష ప్రజావాహిని తరలివచ్చి ఆదిపరాశక్తి కుందుర్పమ్మ దేవత మూర్తిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచే అమ్మవారికి మొక్కుబడి ఉన్న భక్తులు మొక్కులు తీర్చుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యావన్మంది పుర ప్రముఖులు, గ్రామ ప్రజలు, భక్తాదులు పాల్గొన్నారు.