నెల్లిమర్లలో బిజెపి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు రాష్ట్ర బీజేపీ నాయకులూ సోము వీర్రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రజాస్వామ్యనికి విఘాతం కలిగించే చర్యలను ప్రోత్సాహిస్తున్న రాష్ట్రప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలి. మా కార్యకర్తల జోలికొస్తే సహించే ప్రసక్తే లేదు. అధికారం శాశ్వతం అని పాలకులు భ్రమల్లో ఉంటూ దాడులు, దౌర్జన్యాలను ప్రోత్సహిస్తే ప్రభుత్వాల స్థితిని మార్చే ప్రజా క్షేత్రంలో ఓటమి తప్పదు. అధికార బలాన్ని కోల్పోయి అంధకారాన్ని మూటకట్టుకోవడమే తరువాయి. ఘటనకు కారకులైన అధికార పార్టీ కార్యకర్తల అరెస్టుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారిని డిమాండ్ చేస్తున్నాను అని తెలియజేసారు.