అనంతపురం కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతపురం నగర పాలక సంస్థలో పనిచేస్తున్న సీఐటీయూ అనుబంధ మున్సిపల్ కార్మికులు ఉదయం పవర్ ఆఫీస్ దగ్గర నుండి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ఆఫీస్ వద్ద తమ సమస్యల మీద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మునిసిపల్ యూనియన్ నగర అధ్యక్షులు ఎటిఎం నాగరాజు అధ్యక్షత వహించారు. ధర్నాకు హాజరైన సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్, మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే నాగభూషణ న్యూ టౌన్ ప్రధాన కార్యదర్శి ముర్తుజా, ఓల్డ్ టౌన్ ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ఆటో యూనియన్ నాయకుడు ఎన్టీఆర్ శీన, అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు శకుంతల, ఇతర సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, మహిళా కన్వీనర్స్ లక్ష్మీదేవి, లక్ష్మీ నరసమ్మ, మంత్రి వరలక్ష్మి, ఉపాధ్యక్షులు బండారు. ఎర్రి స్వామి, కోశాధికారి తిరుమలేశు, సహాయ కార్యదర్శి బత్తల. ఆదినారాయణ, సలహా కార్యదర్శి శేషేంద్ర కుమార్, కమిటీ సభ్యులు శీనా, నాగేంద్ర, కిరణ్, కృపమ్మ, మంజుల, నాగభూషణ, రాఘవేంద్ర ప్రసాద్, గీతమ్మ , ఎం. ఆదినారాయణ, జయరామ్, ముత్తు, దేవరాజు, సర్దాణమ్మ, వెంకటేష్, రవి, రేణుక, శివ, కోనప్ప, నల్లప్ప, ప్రభాకర్, పుల్లన్న మరియు ఇతర కమిటీ సభ్యులు కార్మికులు పాల్గొనడం జరిగింది.