దారుణంగా హింసింపబడి, హత్య చేయబడిన ఎమ్మెల్సీ అనంత బాబు చంపిన వ్యక్తి ఒక సామాన్య కారు డ్రైవర్. అంతేకాదు ఆయనొక దళితుడు. చంపింది అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ. కానీ ఇదసలు వార్త కానే కాదు అన్నట్టుగా సాక్షి మీడియా ప్రవర్తించింది అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మీడియా ముఖంగా తెలియజేసారు. ఇటువంటి వాళ్ళు దుష్ట చతుష్టయం అంటూ ఎవరి మీదో పడి ఏడుస్తారు. నిజాన్ని రాసే వారు దుష్టులా? అరాచకాలను దాచి ప్రజలను మోసం చేసేవాడు దుష్టుడా? ఇలాంటి మోసపు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టే జగన్ రెడ్డి సభల నుండి జనం గోడలు దూకి మరీ పారిపోతున్నారు. అని తెలియజేస్తూ ప్రజలకి వాస్తవాలు చెప్పని పేపర్ సాక్షి అని ఉపయోగం లేని ఈ పేపర్ వద్దు అని చింపడం జరిగింది.