అనంతపురం జెఎన్టియు విశ్వవిద్యాలయంలో స్టేట్, సెంట్రల్ ఇండిస్టియల్ పిహెచ్డి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించినట్లు డైరెక్టర్ అఫ్ అడ్మిషన్స్ అధికారి బి. ఈశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఉపకులపతి జి. రంగజనార్ధన కౌన్సిలింగ్ సెంటర్ను సందర్శించారు. కౌన్సెలింగ్ ప్రక్రియను ఏ విధంగా జరుగుతోందన్న విషయాలను ఈశ్వర్ రెడ్డితో అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. మొదటిగా కౌన్సెలింగ్కు వచ్చిన సిఎస్ఇ విభాగానికి చెందిన శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి విసి చేతులమీదుగా అడ్మిషన్ పత్రాన్ని అందజేశారు. సోమవారం నాడు మొత్తం 13 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరయ్యారు.