ఉరవకొండ ఆర్బికే కార్యాలయంలో భారీ సర్పం చొరబడి కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద తిష్ట వేసింది. ఉదయం ఆర్బికే కేంద్రాన్ని సిబ్బంది తలుపులు తెరవగానే ద్వారం ముందు పెద్ద సర్పం కనిపించింది. భయబ్రాంతులకు గురై వెంటనే బయటకు వచ్చారు. అక్కడినుంచి పాముని పంపించడానికి సిబ్బంది అలికిడి చేసినా అది మాత్రం అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయింది. అక్కడికి వచ్చిన కొంతమంది రైతులు మాత్రం పాము ను కొట్టి చంపేశారు.
ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో తరుచూ పాములు వస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. గత నెలలో ఇదే కాంపౌండ్ లో ఉన్న తహశీల్దార్ కార్యాలయంలో కూడా పాము హల్చల్ చేసింది. ఇప్పటికైనా అధికారులు ఇక్కడ ఉన్న పాములను పట్టించి అటవీ ప్రాంతంలో వదిలివేయలని ప్రజలు కోరుతున్నారు.