ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి చిరునామా అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి మండలంలోని దిగువపల్లి గ్రామం లో ఆయన ప్రజా ప్రతినిధులు, మండలాధి కారులు, నాయకులు, కార్యకర్తలతో కలసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. దిగువపల్లి సర్పంచ్ ఎద్దుల వెంకటరామి రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల లబ్దిని వివరించారు. ఈ సందర్భంగా పింఛన్దారులకు ప్రతి నెలా ఠంఛన్ గా పింఛన్ అందుతోందన్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నగదు జమ అవుతోందన్నారు.
రైతులు తమకు రైతు భరోసా సొమ్ములు అం దుతున్నాయని, ఇలా నవరత్న పథకాల అమలుపై ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో ఆయన గడప గడపకూ వెళ్లిన సమయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు చేకూరిన లబ్దిని వివరించారు. అనంతరం కరపత్రాన్ని అందించి, రాబోవు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఆశీర్వదించాలని కోరారు. పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరితగతిన సమస్య లను పరిష్కరించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ రంగా రావు, సీఎస్ఓటీ రాజారాం, ఈఓఆర్డీ జిలాన్బా షా, ఆర్డబ్ల్యూఎస్, వైకేపీ, హౌసింగ్, ఏపీఎస్పీడీ సీఎల్, హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు, సచి వాలయ సిబ్బంది, జెడ్పీటీసీ రమణమ్మ, పలు పంచాయతీల సర్పంచ్లు, వైఎస్సార్సీపీ మం డల కన్వీనర్ పల్లె నాగేశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.