తిరువూరు నియోజకవర్గంలో బుధవారం హనుమాన్ జయంతి సందర్భంగా తిరువూరు, గంపలగూడెం మండలాల్లో పలు గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. తిరువూరు చీరాల సెంటర్ లో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం లో బుధవారం 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహిస్తున్నారు. గంపలగూడెం మండలంలో వినగడప, పెనుగొలను, సత్యాల పాడు, తునికిపాడు, ఊటుకూరు, రాజవరం తదితర గ్రామాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా బుధవారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
మేడూరు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ఆలయ అర్చకులు కొమాండూరి ఆంజనేయా చార్యులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి నాగవల్లి పూజ చేశారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.