ముంబైలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ హోటల్ గదిలో మహిళతో శృంగారం చేస్తుండగా ఓ వృద్ధుడు (61) ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. అతడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వృద్ధుడు సబర్బన్ కుర్లాలోని ఓ హోటల్ కి సోమవారం ఓ 40 ఏళ్ల మహిళతో కలిసి వచ్చాడు. ఓ గది తీసుకున్నాడు. ఆమెను తన ప్రేయసి అని చెప్పాడు. ఆ తర్వాత కొంత సయమానికి హోటల్ రిసెప్షన్ కు ఆ మహిళ ఫోన్ చేసింది. వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడని, ఎలాంటి స్పందన లేదని చెప్పింది. దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే హోటల్ కి వచ్చి వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వృద్ధుడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారని కుర్లా పోలీసులు వెల్లడించారు.
అనంతరం ఆ మహిళను పోలీస్ స్టేషన్ కు తరలించి ప్రశ్నించారు. వృద్ధుడు వర్లి ప్రాంతానికి చెందిన వాడని, ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్టు ఆమె చెప్పినట్టు పోలీసులు తెలిపారు. శృంగారం చేస్తుండగా వృద్ధుడు మద్యం తాగేందుకు ప్రయత్నించాడని, కానీ ఉన్నట్టుండి పడిపోయాడని ఆ మహిళ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా యాక్సిడెంటల్ డెత్ రిపోర్టుగా కేసు నమోదు చేశారు. వృద్ధుడి మరణానికి కచ్చితమైన కారణాలు, శృంగారంలో పాల్గొనడానికి ముందు అతడు ఏమైనా ట్యాబ్లెట్లు తీసుకున్నాడా అనే విషయం తెలుసుకొనేందుకు వైద్య నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.