ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొప్పాయిలో పుష్కలంగా పోషకాలు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 04:39 PM

బొప్పాయిలు చూడగానే అందరికీ తినేయాలనిపించేంత ఆకర్షణ కలిగి ఉంటాయి. అయితే వీటిలో పోషకాలు కూడా మెండుగా ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫోలేట్, విటమిన్-ఎ, మెగ్నీషియం, రాగి, పాంతోతేనిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. అంతే కాకుండా బీ-విటమిన్లు, విటమిన్ ఈ, కాల్షియం, పొటాషియం, విటమిన్-కే కూడా తగు మోతాదులో ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో శక్తిని అందించడంతో పాటు ఎన్నో వ్యాధులను దూరం చేయడంలో దోహదపడతాయి. బొప్పాయిని తరచూ తీసుకునే వారిలో ఆస్తమా వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ ఆస్తమా తలెత్తకుండా కాపాడుతుంది. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ బీటా కెరోటిన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. ఇందులో బీటా-కెరోటిన్ వల్ల యువకులలో ప్రోస్టేట్ క్యాన్సర్‌ రాకుండా అడ్డుకుంటుంది.

ఇందులో ఉండే విటమిన్-కే ఎముకలు పటిష్టంగా ఉంచుతుంది. మనం తీసుకునే ఆహారం నుంచి ఎముకలను బలంగా ఉంచే కాల్షియాన్ని శోషించుకునే శక్తిని కలిగి ఉంది. డయాబెటీస్ ఉన్న వ్యక్తులు అధిక ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి వంటి ఆహారం తీసుకుంటే ఇన్సులిన్ స్థాయిలు మెరుగుపడతాయని ఓ అధ్యయనంలో తేలింది. బొప్పాయిలో జీర్ణక్రియకు సహాయపడే పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. బొప్పాయిలో ఫైబర్, నీరు అధికంగా ఉంటాయి. ఈ రెండూ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను అందిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం, విటమిన్లు వంటివి గుండె జబ్బులను దూరం చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలతో చర్మం, జుట్టు సంరక్షణకు దోహపడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com