పగలు మాడు పగులగొట్టేంత ఎండ. ఓ ప్రాంతంలో భానుడి ప్రతాపం. మరో చోట గాలివాన జోరు. ఏపీలో కొన్ని రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగలంతా ఎండ దంచి కొడితే.. సాయంత్రం వేళల్లో వర్షం పడుతోంది. తాజాగా ఇవాళ (మంగళవారం) అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు విజయవాడ, గుంటూరు, కృష్ణా, గోదావరి, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.