ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లికి నిరాకరించిన ప్రియుడికి యువతి షాక్

national |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 05:02 PM

ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో చాలా మంది వెకిలి వేషాలు వేస్తున్నారు. యువతులను ప్రేమ పేరుతో బుట్టలో వేసుకుని, కోరిక తీర్చుకున్న తర్వాత వదిలించుకుంటున్నారు. పెళ్లి మాట ఎత్తితే తప్పించుకుని తిరుగుతూ, కట్నం వచ్చే మరో అమ్మాయి మెడలో తాళి కట్టేస్తున్నారు. ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇదే తరహాలో తనను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న ప్రియుడికి ఓ యువతి షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా గార్డెన్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన సురేంద్ర కుమార్ విశ్వకర్మ అనే వ్యక్తి 38 ఏళ్ల మహిళను ప్రేమ పేరుతో వెంబడించాడు. పెళ్లి చేసుకుంటానని పలుమార్లు ప్రతిపాదించాడు. ఎట్టకేలకు అతడి ప్రపోజల్‌ను బాధిత యువతి అంగీకరించింది. అయితే ఆమె ఇష్టం లేకుండా పలుమార్లు ఆమెపై విశ్వకర్మ అత్యాచారం చేశాడు. వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి, అక్కడ గది అద్దెకు తీసుకుని బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని మహిళ అడిగిన ప్రతి సారీ ఏదో ఒక సాకుతో తప్పించుకునే వాడు. ఇటీవల మరో యువతితో పెళ్లికి విశ్వకర్మ సిద్ధమయ్యాడు. దీనిపై నిలదీసిన బాధిత మహిళకు విశ్వకర్మ ఊహించని షాక్ ఇచ్చాడు. పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. మే 20న కేసు పెట్టగా 48 గంటల వ్యవధిలోనే విశ్వకర్మను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు తాను మోసం చేసినట్లు అంగీకరించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com