ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలవేడి మొదలవ్వడంతో సైలెంట్ గా ఉన్న నేతలంతా ఇపుడు యాక్డిక్ అవుతున్నారు. ఆ కోవలోనే టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతవరకు సైలెంట్ గా ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం క్రమంగా పెంచెతున్నారు. ఇదిలావుంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయన వైఎస్సార్‌సీపీ, బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఆయన మాత్రం పెద్దగా బయట కూడా కనిపించలేదు. కొంతకాలంగా గంటా శ్రీనివాసరావు యాక్టివ్ అయ్యారు.. మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనకు వచ్చిన సమయంలోనూ దూరంగా ఉన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశానికి హాజరుకాలేదు. మళ్లీ చాలా రోజుల తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు. గంటా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తరం నియోజకవర్గం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. తెలుగు మహిళా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో వర్గపోరు బయటపడింది.. రెండు వర్గాల మధ్య సమన్వయ లోపంతో ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. సభావేధికపై మాజీ మంత్రి, ఉత్తరనియోజవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉండగానే సభ్యులు వాదోపవాదాలు జరిగాయి. తర్వాత ఈ వ్యవహారంలో కల్పించుకున్న గంటా.. నేతలకు సర్థిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.