ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 31న జిల్లాకు చెందిన లబ్ధిదారులతో ముఖాముఖిలో మాట్లాడనున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై ముఖ్య కార్యదర్శి మంగళవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. కేంద్ర పథకాలపై ప్రధాని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉదయం 9. 45 నుంచి మధ్యాహ్నం 12. 10 వరకు ముఖాముఖిలో మాట్లాడుతారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి లబ్ధిదారులను ఈ నెల 26లోగా గుర్తించి నివేదిక సమర్పిస్తామని ముఖ్య కార్యదర్శికి జేసీ వెంకటేశ్వర్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa