ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన విత్తనాల వ్యాపారి ఆకుల రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు హైదరాబాదుకు చెందిన విత్తనాల వ్యాపారులు రవి, నరసింహులు, భూషణంపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాది రాధాకృష్ణ 2011లో రూ. కోటి విలువ చేసే పత్తి విత్తనాలను హైదరాబాదు వారికి సరఫరా చేశారని ఇందుకు వారు కేవలం రూ. 25 లక్షలు చెల్లించారని, మిగిలిన మొత్తం కోసం ఎన్నిమార్లు అడిగినా ఫలితం
లేకపోవడంతో వారిపై బాధితుడు చీటింగ్ కేసు పెట్టినట్లు ఎస్ఐ వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నామన్నారు.