తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లాలోని మానవపాడు - ఎర్రవెల్లి హైవేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బనగానపల్లెకు చెందిన ఇరువురు యువకులు దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి 11. 30 గంటలకు హైదరాబాదులో తమ పని ముగించుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బనగానపల్లె పట్టణానికి చెందిన ఆకారపు సుదర్శన్ కుమారుడు సుశాంత్(21), పసుపుల జనార్దన్ కుమారుడు మణిదీప్ (20) అక్కడికక్కడే మృతిచెందారు.
శివ, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. వీరు హైదరాబాదులో పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా డ్రైవర్ కునుకుపాటుకు గురై డివైడర్ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు పక్కనే పొలాల్లోకి బోల్లా కొట్టింది. మణిదీప్, సుశాంత్ మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్జం నిర్వహించారు. అనంతరం బనగానపల్లెకు మృతదే హాలను తీసుకొచ్చారు. వీరివి కిరాణం వ్యాపారానికి చెందిన కుటుంబాలు. సుశాంత్ పైలెట్ ట్రైనింగ్ పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
వీరి మృతితో పట్టణంలోని కిరాణ వ్యాపారులు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ బీనీ రాజారెడ్డి, బీసీ బాల తిమ్మారెడ్డి మృతదేహాలకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.