ప్రస్తుత జిల్లా విజయనగరం - పాత జిల్లా శ్రీకాకుళం రాజాం అసెంబ్లీ నియోజకవర్గం, రాజాం-వంగర మండలం, పటువర్ధనం గ్రామం. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్మించబడ్డ "మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్టు" వల్ల భూములు, ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు న్యాయం చెయ్యాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు , స్థానిక బీజేపీ నాయకులతో కలిసి నిరసన వ్యక్త పరిచారు. అలానే హిరమండలం లోని వంశధార రిజర్వాయర్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టంను అనుసరించి నష్టపరిహారం చెల్లించాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.