ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్ లోనే దావుద్ ఇబ్రహీం....మేనల్లుడి వాగ్ములం

international |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 03:49 PM

దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడంటూ పక్కాగా తెలిసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ పాకిస్థాన్‌లోని కరాచీలోనే ఉన్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కనుగొన్నారు. దీంతో చీకటి రాజ్యాన్ని ఏలే దావూద్ ఇబ్రహీం ఆచూకి లభ్యమైంది. పలు కేసుల్లో కీలక నిందితుడుగా ఉన్నా దావూద్ ఎప్పుడు పోలీసులకు పట్టుబడలేదు. ఎప్పటి నుంచో ఆయన కోసం అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన గురించి కీలక సమాచారం తెలిసింది. 


ఈ విషయాన్ని దావూద్ సోదరి హసీనా పార్కర్ కొడుకు అలీషా పార్కర్ తెలియజేసినట్టు అధికారులు చెప్పారు. ఓ మనీ లాండరింగ్ కేసులో విచారించడంతో దావూద్ కరాచీలో నివసిస్తున్నాడని అలీషా వెల్లడించాడు. తన కుటుంబానికి, తనకు దావూద్‌తో సంబంధం లేదని చెప్పాడు. దావూద్ భార్య మెహజబిన్ పండుగల సమయంలో తమ కుటుంబ సభ్యులను సంప్రదిస్తుందని చెప్పాడు.


అలాగే అలీషా తన తల్లి హసీనా పార్కర్ పనులు గురించి తెలియజేశాడు. "మా అమ్మ వాస్తావానికి గృహిణి, కానీ ఆమె జీవనోపాధి కోసం కొన్ని చిన్న ఆర్థిక లావాదేవీలు చేసేది. ఆమె తమ వ్యాపారానికి కావాల్సిన డబ్బులను అంటే రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు అప్పుగా ఇచ్చేది. రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడి పెట్టేది." అలీషా పేర్కొన్నాడు. అలాగే దావూద్ ఇబ్రహీం 1986లో భారత దేశాన్ని విడిచిపెట్టాడని పార్కర్ దర్యాప్తు సంస్థకు తెలిపాడు.


ఇదిలావుంటే దావూద్‌కు అక్రమంగా డబ్బు సంపాదించి, హవాలా మార్గాల ద్వారా లాండరింగ్‌ చేయడంలో సహకరించిన దావూద్ బంధువులపై ఈడీ విచారణ జరుపుతోంది. అంతకు ముందు ఇదే కేసులో ఫిబ్రవరిలో చోటా షకీల్ సహాయకుడు సలీం ఖురేషీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ప్రశ్నించింది. ఖురేషీ ఫోర్జరీ పాస్‌పరన్టుపై పలుమార్లు పాకిస్థాన్ వెళ్లినట్టు బయటపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com