ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్య నేరం కింద గొర్రె అరెస్ట్...నిర్దోషిగా యజమాని

international |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 03:50 PM

సమాజంలో ఎన్నో వింతలే కాదు  వింత ఘటనలు చోటుచేసుకొంటూవుంటాయి. అలాంటి ఘటనే  ఇటీవల సూడాన్ దేశంలో జరిగింది. దొంగలకు, దోపిడీలు చేసే వారికి, హత్యలు చేసేవారికి జైలు శిక్ష పడడం తెలిసిందే. ఎలాంటి శిక్షలైనా మనుషులకు విధిస్తారు. ఒకవేళ జంతువులు, మృగాలు మీద పడి ప్రాణాలు తీసినా దానిని ప్రమాదంగానే భావిస్తాం. అలాంటి కేసుల్లో ఆ జంతువులను పట్టుకుని బంధిస్తారు. కానీ వాటికి శిక్షలు విధించడం అనేదే లేదు. కానీ ఒక కేసులో విచిత్రంగా కోర్టు ఒక గొర్రెకు శిక్ష వేసింది. ఈ ఆసక్తికరమైన ఘటన దక్షిణ సూడాన్‌లో ఇది జరిగింది.


దక్షిణ సూడాన్‌లో 45 ఏళ్ల మహిళను చంపినందుకు ఒక ఒక గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. అదీయు చాపింగ్‌ అనే మహిళపై గొర్రె దాడి చేసింది. పదే పదే తలతో కొట్టి, ఆమె పక్కటెముకలు విరిచింది. దాంతో చాపింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ గొర్రెను అదుపులోకి తీసుకున్నారు. గొర్రె యజమాని నిర్దోషి కాబట్టి... నేరానికి పాల్పడిన గొర్రె అనే లాజిక్‌తో అక్కడి పోలీసులు దానినే అరెస్ట్ చేశారు.


రుంబెక్ ఈస్ట్‌లోని అకుయెల్ యోల్ అనే ప్రదేశంలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ కేసులో గొర్రెల యజమానిని అమాయకుడని నిర్ధారించిన కోర్టు.. అతడిని దోషిగా తేల్చలేదు. కానీ అతనికి భారీగా ఫైన్ వేసింది. చనిపోయిన మహిళ కుటుంబానికి ఐదు ఆవులను అందించాలని ఆదేశించింది. అదేవిధంగా శిక్ష పూర్తైన తర్వాత ఆ కుటుంబానికి ఈ గొర్రెను కూడా పరిహారంగా ఇవ్వాలని సూచించింది. బాధితురాలి కుటుంబానికి పరిహారాన్ని త్వరగా ఇవ్వాలని తెలిపింది. కోర్టు చెప్పిన ఈ నిర్ణయానికి కట్టుబడి.. బాధితురాలి కుటుంబం, గొర్రెల యజమాని దుయోని మాన్యాంగ్ ధాల్ ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇదిలావుంటే ఈ మూడేళ్లపాటు ఆ గొర్రెను అడ్యూల్ కౌంటీలోని మిలిటరీ క్యాంప్‌లో ఉంచనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com