ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేద్కర్ పేరును రాజకీయాల్లోకి లాగడమా: జీవీఎల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 11:40 PM

అంబేద్కర్ పేరును వైసీపీ ప్రభుత్వం రాజకీయాల్లోకి లాగడం దారుణమని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కోనసీమలో జరిగిన హింసాత్మక ఘటనలను ఖండిస్తున్నామని జీవీఎల్ అన్నారు. ప్రణాళిక ప్రకారమే కోనసీమ హింస జరిగిందని అన్నారు. ఒక మంత్రికే ఇలా జరిగిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అందరూ అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కోనసీమ ఘటనలో వైసీపీ భాగస్వామ్యం ఉందని అన్నారు.  ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పారు. అంబేద్కర్ మీద అంత అభిమానం ఉంటే నవరత్నాలకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చుకదా అని అన్నారు. జిన్నా టవర్స్ పేరు మార్చాలని కోరితే తమ నేతలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. హిందూ వ్యతిరేక విధానాలను వీడాలని... లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com