జపాన్ దేశానికి చెందిన టోకో ఇవీ అనే వ్యక్తి తాను పూర్తిగా శునకంలా కనిపించాలనే కోరికను నెరవేర్చుకున్నాడు. ఇందుకోసం దాదాపు రూ.12 లక్షలు ఖర్చు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతడిని శునకంలా కనిపించేలా చేయడానికి నిపుణులు 40 రోజులపాటు కష్టపడ్డారు.
జెప్పెట్ అనే ఓ సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం శిల్పాలను తయారు చేస్తుంది. ప్రసిద్ధ మస్కట్ పాత్రల దుస్తులను కూడా రూపొందిస్తోంది. టోకో ఇవీ ఆ సంస్థను సంప్రదించాడు. ఎంత ఖర్చునైనా భరిస్తానని చెప్పాడు. ఆ సంస్థ కళాకారులు 40 రోజులపాట కష్టపడి టోకో ఇవీని కోలీ జాతి శునకంలా మార్చారు. మేకప్, ఇతరత్రా ఖర్చుల కోసం దాదాపు రూ.12 లక్షలు ఖర్చయ్యాయి. అయితే ఇలాగే శునకంలా ఎన్నిరోజులపాటు ఉంటాననే విషయం మాత్రం టోకో ఇవీ ఇంకా చెప్పలేదు.