తిరువూరు నియోజకవర్గంలో టమాటా ధర రోజు రోజుకి పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు వామ్మో టమాటా కొనలేము, తినలేము అంటూ వాపోతున్నారు. పది రోజుల కిందట 15 నుంచి 20 రూపాయలకు కిలో టమాట మార్కెట్లో లభించింది. ఈ పది రోజులు వ్యవధి లోనే రోజురోజుకూ పెరుగుతూ గురువారం కొన్ని మార్కెట్లలో కిలో టమాట 58 రూపాయలను నిర్ణయించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో టమాట చిల్లర వర్తకులు, బడ్డీ కొట్లు, తోపుడు బండి మీద అమ్మే వారు కిలో టమాట 60 నుంచి వంద రూపాయలు అమ్ముతున్నారు. దీంతో టమాటా కొనే అవకాశం పోయిందని సామాన్య ప్రజలు వాపోతున్నారు.